Header Banner

'పద్మశ్రీ' వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం! 30 ఏళ్ల క్రితమే ఊహించారని..

  Tue Feb 04, 2025 20:08        Politics

ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ 'పద్మశ్రీ' పురష్కారం పొందిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ... చంద్రబాబు కీర్తి మరింత ఇనుమడిస్తుందని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షం అవుతుందని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయని... ఆయన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చుతాయని అన్నారు. అమరావతి రాజధాని పూర్తై ప్రపంచంలో మేటి నగరం అవుతుందని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తై ప్రజలకు మేలు జరుగుతుందని నాగఫణి శర్మ అన్నారు. ముఖ్యమంత్రిని ఈ మేరకు ఆయన ఆశీర్వదించారు. 'పద్మశ్రీ' వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు... ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు.

 

ఇంకా చదవండి: ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల ఛైర్మన్లు నియామకం! కీలక నోటిఫికేషన్ జారీ!

 

ఈ సందర్బంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ... దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత మరొకరు లేరని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్‌కు ఐటీ వచ్చిందని... ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందని అన్నారు. రాళ్లు, రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్‌లో ఎలా ఉండబోతుందో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఊహించారని నాగఫణి శర్మ అన్నారు. ఐటీ కంపెనీలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ఈ ప్రాంతం అంతా ఐటీ కంపెనీలతో, ఐటీ ఉద్యోగులతో నిండిపోతుంది... దేశ, విదేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు... అలాంటి ఈ ప్రాంతంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరియాలి... అవధాన ప్రక్రియ బతకాలి... ప్రజలందరికీ మన కీర్తి, మన భాష, మన ఆచారాలు తెలియాలని చంద్రబాబు ఆనాడే మాకు అవధాన సరస్వతీ పీఠం ఏర్పాటుకు స్థలం మంజూరు చేశారు అని నాగఫణి శర్మ వివరించారు. పెద్ద పెద్ద ఐటీ సంస్థల మధ్యలో మన తెలుగు సంస్కృతి ఉండాలని ఆయన చేసిన ఆలోచన వల్లనే నాడు అక్కడ అవధాన సరస్వతీ పీఠం ఏర్పాటు చేసినట్లు నాగఫణి శర్మ వెల్లడించారు.


ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!

 

ప్రియురాలి కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ MLA కొడుకు.. ఎంతకి తెగించాడురా.. అందరూ షాక్!

 

సుమ బండారం బయటపెట్టిన యూట్యూబర్.. గంట షూటింగ్‌కొస్తే.. సోషల్ మీడియాలో వైరల్!

 

 

త్వరలోనే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్!

 

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్‌డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!

 

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Madugula #NagaphaniSharma #Chandrababu #PadmaShri #AndhraPradesh